close

వసుంధర

అక్కడ పెళ్లి వయసు పెంచారు

అది ఇండోనేషియా.... అక్కడ బాల్య వివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఆ పార్లమెంట్‌ అంతకుముందు ఉన్న వివాహ చట్టాన్ని సమీక్షించింది. పెళ్లి చేసుకునే వయసును పదహారు నుంచి పందొమ్మిదేళ్లకు పొడిగించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఇంతకుముందు అక్కడ వివాహా వయసు అమ్మాయిలకు పదహారు, అబ్బాయిలకు పందొమ్మిది సంవత్సరాలుగా ఉండేది. ఒకవేళ తల్లిదండ్రులు తమ కూతురుకు పెళ్లి చేయాలనుకుంటే ఆ వయసుతోనూ సంబంధం ఉండేది కాదు. అత్యధిక బాల వధువులు ఉన్న దేశంగా ఇండోనేషియా ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. యూనిసెఫ్‌ నివేదిక ప్రకారం అక్కడ పద్నాలుగు శాతం అమ్మాయిలకు పద్దెనిమిదేళ్ల లోపే పెళ్లిళ్లు చేస్తున్నారు. కొందరికైతే పదిహేనేళ్లు రాకముందే చేసిన సందర్భాలు ఉన్నాయి. పేదరికం, కుటుంబ గౌరవం, సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు, మతపరమైన చట్టాలు... అన్నీ కలిసి అక్కడ ఈ తరహా పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు