close

వసుంధర

శానిటరీ న్యాప్‌కిన్‌ల తయారీ మంచిదేనా?

నేను డిగ్రీ పూర్తి చేశాను. నాకు ముప్పై రెండు సంవత్సరాలు. నా పేరు మీద అరెకరం పొలం ఉంది. ఆర్గానిక్‌ శానిటరీ న్యాప్‌కిన్ల తయారీ పరిశ్రమని ప్రారంభించాలనుకుంటున్నా. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించొచ్చనేది నా అభిప్రాయం. దీనికి పెట్టుబడి ఎంత అవసరమవుతుంది? సామాజిక స్పృహతో చేసే ఈ పనికి ప్రత్యేక రాయితీలు ఏమైనా ఉంటాయా?

- ఓ సోదరి

మీ ఆలోచన మంచిదే. ప్రస్తుతం సేంద్రియ విధానంలో తయారుచేసిన శానిటరీ న్యాప్‌కిన్లకు ఆదరణఎక్కువ. మీరు ముద్ర లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం ఉద్దేశించిన పథకాలన్నీ మీకు వర్తిస్తాయి. తగిన రాయితీ లభిస్తుంది. మీరు ఒకవేళ డిస్పోజబుల్‌ ప్యాడ్‌లను చేయాలనుకుంటే... యంత్రాల కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు అవసరమవుతాయి. కనీసం ఆరునెలలకు సరిపడా ముడి సరకుని అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకోసం 2.5 లక్షలు కావాలి. కనీసం ఆరునెలల పెట్టుబడిని అందుబాటులో ఉంచుకుని ఇతరత్రా ఖర్చులతో కలిపి పదిహేను లక్షల రూపాయల వరకు కావాల్సి ఉంటుంది. అదే మీరు రీ యూజబుల్‌ క్లాత్‌ప్యాడ్‌లు తయారు చేయాలనుకుంటే...1.5లక్షల వరకు యంత్రాల కోసం ఖర్చు చేయాలి. ఇతరత్రా అవసరాలు, ఖర్చులు, పెట్టుబడి అంతా కలిపి మూడు లక్షల రూపాయలు అవసరమవుతాయి. ముందు మీ ఆలోచనని ప్రణాళిక రూపంలో పెట్టండి. తరువాత మార్కెట్‌ని గమనించండి. ఆపై ముందడుగు వేయండి.

ఇంటి దగ్గరే ఉండి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనుకున్న మహిళలకు ఇది చక్కని అవకాశం. వ్యాపారం చేయాలనుకున్నా, మార్కెటింగ్‌లో మెలకువలు తెలుసుకోవాలనుకున్నా, కొత్త అంశాల్లో శిక్షణ తీసుకోవాలనుకున్నా... మీకున్న సందేహాలను మాకు పంపించండి. వాటికి సమాధానాలు అందించే ప్రయత్నం మేం చేస్తాం!

మా చిరునామా

 email: vasundhara@eenadu.net


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు