close

ఫీచర్ పేజీలు

74 ఏళ్ల సూపర్‌ రైడర్‌

విశేషం

రెండున్నర లక్షల రూపాయల ఖరీదు.. నూటా యాభై కేజీల బరువుండే సూపర్‌ బైక్‌ని ఓ కుర్రాడు పరుగులు పెట్టిస్తే పెద్ద విషయమేం కాదుగానీ డెబ్భై నాలుగేళ్ల తాతయ్య మోజు పడి కొంటే అది చెప్పుకోదగ్గ విశేషమే. హోండా సీబీఆర్‌ 300ఆర్‌ ఈమధ్యే అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో వచ్చింది. తమిళనాడులోని కొడైకెనాల్‌ వాసి మినూ అవారీ దానిపై మనసు పారేసుకున్నాడు. ఫీచర్లు నచ్చి నాలుగు నెలల ముందే బుకింగ్‌ చేసుకున్నాడు. తన 74వ పుట్టినరోజు కోసం ఇలా తనకు తాను ఈ మోటార్‌సైకిల్‌ని బహుమతిగా ఇచ్చుకున్నాడు. డెలివరీ అందే సమయంలో కొడైకెనాల్‌ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూరుకి వెళ్లి మరీ బండి తీసుకున్నాడు. 286.01సీసీ, 30.15పీఎస్‌ జీ 8000ఆర్‌పీఎం, ఫ్యుయెల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌, డ్యుయెల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, అలాయ్‌ చక్రాలు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు.. సీబీఆర్‌ 300ఆర్‌ ప్రత్యేకతలు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు