close

తాజా వార్తలు

అలా అనడం బాధాకరం: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్‌ చేసిన కృషి బాగుందని.. అంతకు ముందు కాంగ్రెస్‌ కృషి కూడా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశ్రమల పద్దుపై అసెంబ్లీలో ఇచ్చిన సమాధానాలపై రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్‌లో ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేసినందుకుగాను కేటీఆర్‌కు రాజగోపాల్‌ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని.. నల్గొండ జిల్లాలో ఇంకా పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా దండుమల్కాపూర్‌ పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. ఫార్మా పరిశ్రమలు నిబంధనలు పాటించకపోవడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. జలాలు కాలుష్యం అవుతున్నాయని అన్నారు. పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సును కోరతామని.. మంచి పనులు ఏ పార్టీ చేసినా ప్రశంసిస్తామన్నారు. అయితే కాంగ్రెస్‌ హయాంలో ఎలాంటి ప్రాజెక్టులు, పవర్‌ప్లాంటులు నెలకొల్పలేదని వారు అనడం మాత్రం చాలా బాధాకరంగా ఉందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు