close

తాజా వార్తలు

‘ద్రవిడ్‌ ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మాజీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2018లో ద్రవిడ్‌ ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ వెబ్‌సైట్‌లోని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ సెక్షన్‌లో ద్రవిడ్‌ పేరును పొందుపరిచింది. కానీ ద్రవిడ్‌ వివరాల్లో ఎడమచేతి బ్యాట్స్‌మన్‌ అని ఉంచింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఐసీసీపై విమర్శల జడివాన కురిపించారు. పొరపాటుని గమనించిన ఐసీసీ ద్రవిడ్‌ కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా వెబ్‌సైట్‌లో సరిచేసింది. భారత్‌ తరఫున బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018), సచిన్ (2019) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కింది. 

టీమ్‌ఇండియా తరఫున 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన ద్రవిడ్‌ 24,417 పరుగులు బాదాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ సందర్భంగా శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న కోహ్లీసేనను ద్రవిడ్‌ కలిశాడు. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పాటు ఆటగాళ్లను కలిసిన అతడు వారితో కాసేపు ముచ్చటించాడు. జులైలో అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీకి హెడ్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.  


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు