close

తాజా వార్తలు

జట్టుని గెలిపించాడు..వీడ్కోలు పలికాడు

చిట్టగాంగ్‌: ముక్కోణపు టీ20 టోర్నీలో అఫ్గానిస్థాన్‌పై జింబాబ్వే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  జింబాబ్వే కెప్టెన్‌ మసకడ్జ 71 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.  తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ రహ్మనుల్లా (61) అర్ధశతకంతో రాణించాడు. జింబాబ్వే బౌలర్‌ క్రిస్‌ నాలుగు వికెట్లు పడగొట్టి అఫ్గాన్‌ను కట్టడి చేశాడు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే  19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌పై జింబాబ్వేకు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌తో మసకడ్జ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 ఏళ్ల అతడి క్రికెట్‌ కెరీర్‌లో జింబాబ్వే తరఫున 38 మ్యాచ్‌లు, 209 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. ఆఖరి మ్యాచ్‌లో రాణించడం, విజయంతో కెరీర్‌ను ముగించడం అద్భుతంగా ఉందని మ్యాచ్‌ అనంతరం అతడు తెలిపాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు