close

తాజా వార్తలు

రేవంత్‌ నా ముద్దుల అన్నయ్య: సంపత్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్‌ తన ముద్దుల అన్నయ్య అని అంటూనే ఆయన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. యురేనియంపై తనకు ఏబీసీడీలు తెలియవంటూ రేవంత్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కార్యవర్గ సమావేశంలో ఏం మాట్లాడానో తెలుసుకుని ఆయన స్పందించి ఉంటే బాగుండేదన్నారు. 
తాను మాట్లాడింది పార్టీ అంతర్గత సమావేశంలో అని.. రేవంత్‌లా మీడియా ముందు కాదన్నారు. ఆయనలా అవగాహన లేకుండా తాను మాట్లాడనని చెప్పారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పిర్యాదు చేయలేదని సంపత్‌ స్పష్టం చేశారు. సినిమాలో హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని తానే అని రేవంత్ అనుకుంటారని.. కానీ కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్  అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఉత్తమ్ పద్మావతియే అని సంపత్‌ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు