close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కాటుక దిద్దేద్దాం కొత్తగా!

మేని సొగసుకు సౌందర్య ఉత్పత్తులు మెరుగులు అద్దుతాయనడంలో అతిశయోక్తి లేదు. వాటిలో ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న మేకప్‌ సామగ్రి గురించి తెలుసుకుందామా!

గ్రాఫిక్‌ లైనర్‌... చిన్నప్పుడు కళ్లకు కాటుకతోపాటు కంటి చివర వరకూ సన్న గీతలా అమ్మ పెట్టేది గుర్తుందా... ఇప్పుడు దీనికే ఆదరణ ఎక్కువ. కన్ను మొదలు నుంచి చివర వరకు తామర ఆకుల్లా కాటుక దిద్దుకుంటే... మీ మోముపై మీనాలు ప్రతక్ష్యమైపోతాయి. సాయంత్రపు వేడుకలకు ఇది బాగుంటుంది. కనురెప్పలపై షిమ్మర్‌తో పసిడి, వెండి రంగుల మేళవింపుతో మెరుగులు దిద్దుకుంటే చాలు.

కళ్లకు కొత్తగా... నలుపు రంగు వాడకాన్ని తగ్గించి... కొన్నాళ్లు నీలం, ఆకుపచ్ఛ.. లేదా రెండు రంగుల్ని మేళవించిన లైనర్‌ని ప్రయత్నించి చూడండి. ఇప్పుడు అదే ట్రెండ్‌ మరి. మస్కారాతో ఫినిషింగ్‌ టచ్‌ చేస్తే చాలు.

అధరహో అనిపించేలా... ముదురు వర్ణాల లిప్‌స్టిక్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. ఏ కాలానికైనా ఎరుపు రంగు అదిరిపోతుంది. లేదా గ్లాసీ లిప్స్‌ సొంతం కావాలంటే... లిప్‌గ్లాస్‌ వాడేయండి.


మరిన్ని