close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మెరిసేందుకు కొద్దిగా చాలు!

పండగ రోజుల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బయటకు వెళ్లేముందు... అలంకరణ విషయంలో పాటించాల్సిన సూత్రాలేంటో చూద్దామా...

* ఎండలో ఎక్కువ సమయం ఉంటే చెమట కారణంగా అలంకరణ చెదిరిపోవచ్చు. ప్రతి రెండు గంటలకోసారి ముఖానికి టచప్‌ ఇచ్చుకోవడం చాలా అవసరం. మీరేం చేయక్కర్లేదు. కొద్దిగా పౌడర్‌ రాసుకున్నా సరిపోతుంది.  
* లిప్‌బామ్‌ను ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలి. ఎండ, మేకప్‌ కారణంగా పెదాలు పొడిబారే అవకాశం ఉంది. డీహైడ్రేషన్‌ సమస్యతోనూ ఇలా కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పెదాలకు లిప్‌స్టిక్‌ వేసుకోవాలని లేదు. కొద్దిగా లిప్‌బామ్‌ రాసుకున్నా చాలు.
* ఎండ, కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి జుట్టును కాపాడుకోవాలి. డ్రైషాంపూ వాడటం వల్ల జుట్టు పట్టుకుచ్చులా కనిపిస్తుంది. తలకు ప్రత్యేకంగా సీరమ్‌లు దొరుకుతాయి. కొద్దిగా రాసుకున్నా... జుట్టు ఎండుగడ్డిలా కనిపించదు.
* ఎలాంటి అలంకరణ చేసుకోకపోయినా సరే... ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటూ ఉండాలి. దానివల్ల చర్మంపై ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. చేతులకూ మాయిశ్చరైజర్‌ తప్పనిసరి. చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
* బయట ఎక్కువసేపు గడపాల్సి వస్తే...జిడ్డులేని మేకప్‌ సామగ్రిని ఎంచుకోవడం మంచిది. అలంకరణా వీలైనంత తక్కువగా వేసుకోవడమే మేలు అంటారు నిపుణులు.


మరిన్ని