close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గాంధీపై పరీక్ష

దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీ ఆలోచనలు ఎంతో ప్రభావితం చేశాయి. వాటి ఆధారంగానే అబీదా జల్గావ్‌లోని గాంధీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, ద గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీ విచార్‌ సంస్కార్‌ పరీక్ష(జీవీఎస్పీ) నిర్వహిస్తోంది. ఇందులో పాఠశాల, కళాశాల విద్యార్థుల నుంచి పెద్దల వరకు ఎవరైనా పాల్గొనవచ్ఛు ప్రతి జూన్‌లో రిజిస్ట్రేషన్‌ మొదలవుతుంది. ఏటా డిసెంబరు చివరి వారంలో కర్ణాటక రాష్ట్రమంతా ఈ పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్ష నిర్వహణ రుసుము 45 రూపాయలు. ‘ఆసక్తి ఉన్నవారికి మహాత్మునికి సంబంధించిన వివరాలున్న 130 పేజీల పుస్తకాన్ని అందిస్తాం. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రం, గాంధీ సిద్ధాంతాలున్న పుస్తకాన్ని కానుకగా ఇస్తాం. ప్రతి ఏడాది 10 నుంచి 12 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. కన్నడం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మరాఠి భాషల్లో దీన్ని నిర్వహిస్తాం. ఎక్కువ మార్కులు సాధించిన వారిని సర్వోదయ దినోత్సవానికి ఆహ్వానిస్తాం. ఈ ఏడాది నుంచి పరప్పన అగ్రహార కేంద్రకారాగారంలోని ఖైదీలకూ పరీక్ష నిర్వహించాలనుకుంటున్నాం. మహాత్ముడి జీవితానికి సంబంధించిన సినిమాను ప్రదర్శించి, ఆయన రచనలను వారికి అందించాలనుకుంటున్నాం. ఇది వారిలో కొంతైనా పరివర్తన తెస్తుందనుకుంటున్నా...’ అని చెబుతుంది అబీదా.

చిన్నప్పటి నుంచే...

కర్ణాటక, రామనగర్‌ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేస్తోంది 43 ఏళ్ల అబీదా. దేవనగిరి సమీపంలోని అసాస్‌వెహల్లీ ఆమె సొంతూరు. తండ్రి అఫ్తాద్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి నర్సు. తండ్రి ప్రభావంతో ఎనిమిదేళ్లకే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైంది. అప్పటి నుంచి ఖాదీ వస్త్రాలే ధరిస్తోంది. నేషనల్‌ లా కాలేజీలో న్యాయవాద విద్యనభ్యసించింది. బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చదివి, అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ చేసింది. రాజస్థాన్‌లోని సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందింది అబీదా.


మరిన్ని