close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
యాభైల్లో ట్రెండీగా!

ఆహార్యంలో మార్పులు చేసుకుంటూనే... ట్రెండీగా కనిపించడం అదీ యాభైల్లో అంటే మాటలు కాదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా...●

వస్త్రం ఎలాంటిదైనా ప్రింట్లు, అంచులు వీలైనంత చిన్నగా ఉండేలా చూసుకోండి. వీటితో సన్నగా కనిపిస్తారు. లినెన్‌, ఖాదీ, జార్జెట్‌ వంటి తేలికపాటి వస్త్రాలు బాగుంటాయి. రంగుల విషయానికొస్తే లేత గోధుమ, ఊదా, ముదురునీలం, ఆకుపచ్చ, ముదురుఎరుపు వంటివి నప్పుతాయి.

లెగ్గింగ్‌ల కన్నా... పలాజోలు బాగుంటాయి. సౌకర్యంతోపాటు, ఫ్యాషన్‌లుక్‌ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు ఇవి ప్రింట్లలోనూ వస్తున్నాయి కాబట్టి కుర్తాకు తగినట్లుగా నచ్చిన దాన్ని ఎంచుకుని చూడండి.

ఇన్నాళ్లు మీకు హీల్స్‌ వేసుకోవడం అలవాటా... వాటి ఎత్తును తగ్గించండి. ఈ చిన్న మార్పుతో మీ ఆకృతి నిటారుగా ఉంటుంది. కాళ్లనొప్పులూ ఉండవు. యాంకిల్‌బూట్లు, హైహీల్స్‌ వంటివి తప్పనిసరైతేనే వేసుకోవాలి. రోజువారీ అవసరాల కోసం సాదా కాన్వాస్‌బూట్లు ప్రయత్నించొచ్ఛు సౌకర్యంగా ఉంటుంది.

దుస్తులు వదులుగా కాకుండా... శరీరానికి అతుక్కున్నట్లు ఉండటం మంచిది. సౌకర్యంగానూ అనిపిస్తుంది.

చాలామంది హ్యాండ్‌బ్యాగు, చెప్పులు మ్యాచింగ్‌ ఉండేలా చూసుకుంటారు కానీ వద్ధు దానివల్ల మీకంటూ ఓ లుక్‌ ఉండదు. పైగా అలా మ్యాచ్‌ చేసుకోవడం ఫ్యాషన్‌ కాదంటారు నిపుణులు.


మరిన్ని