close

తాజా వార్తలు

కపిల్‌ పాత్ర కోసం రణవీర్‌ ఇలా..

ముంబయి: భారత క్రికెట్‌ చరిత్రలో గుర్తుండిపోయే విషయం 1983లో మొదటిసారి ప్రపంచకప్‌ను సాధించడం. కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే ప్రస్తుతం కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘83’. రణవీర్‌సింగ్‌ కథానాయకుడు. అయితే ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా కనిపించడం కోసం రణవీర్‌ అన్ని విధాలుగా మారాడని చెబుతున్నారు ప్రముఖ కోచ్‌ రాజీవ్‌ మెహ్రా. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు.

‘గతేడాది ఆగస్టు నుంచి ఈ సినిమాలో నటిస్తున్న ప్రతిఒక్కరూ వారి వారి పాత్రలకు అనుగుణంగా ట్రైనింగ్‌ తీసుకున్నారు. రణవీర్‌ అక్టోబర్‌ నుంచి ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. కొన్నిసార్లు రణవీర్‌ బౌలింగ్‌ వల్ల మా తలలకు చాలాసార్లు గాయాలయ్యేవి. అందరితోపాటే రణవీర్‌ కూడా ఉదయం 8 గంటలకే గ్రౌండ్‌కు వచ్చి ప్రాక్టీస్‌లో పాల్గొనేవాడు. సాయంత్రం టీం అంతా వెళ్లిపోయాక కూడా గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండేవాడు.’ అని రాజీవ్‌ తెలిపారు.

‘‘83’ కోసం రణవీర్‌ను తీసుకున్నప్పుడు ఆయన 86 కిలోల బరువు ఉండేవాడు. అయితే సినిమాకి కోసం ఆయన 75 కిలోలకు బరువు తగ్గారు. ఈ విధంగా బరువు తగ్గడం కోసం ఆయన నాలుగు నెలలపాటు ప్రతిరోజు సాయంత్రం జిమ్‌లో వర్కౌట్లు, స్విమ్మింగ్‌ చేశారు. మోకాలు నొప్పితో బాధపడడం వల్ల రణవీర్‌ వేగంగా పరిగెత్తలేకపోయేవాడు. ఆ సమయంలో ఫిట్‌నెస్‌ టీం ఆయనకి ఎంతగానో తోడ్పడింది.’ అని రాజీవ్‌ పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు