close

తాజా వార్తలు

మార్కెట్‌లోకి టాటా టిగోర్‌ ఎలక్ట్రిక్‌ కారు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ టిగోర్‌ ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహకల్‌) సెడాన్‌ కారును విడుదలచేసింది. మునుపటి కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం దీని సొంతం. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలు. ఎక్స్‌ఈ+, ఎక్స్‌ఎం+, ఎక్స్‌టి+ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇప్పటి వరకు టాటా మోటార్స్‌ ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను  కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు, క్యాబ్‌ నిర్వాహకులకు మాత్రమే విక్రయించేది. ఇక నుంచి వ్యక్తిగత వినియోగదారులు కూడా ఈ వాహనాలను కొనుగోలుచేయవచ్చు అని కంపెనీ తెలిపింది. 

ఇక ప్రత్యేకతల విషయానికొస్తే అధిక ఉష్ణోగ్రతలలో కూడా స్థిరమైన ప్రదర్శన కోసం 21.5 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది గతంలో కంటే 71 కిలోమీటర్లు అదనం. ఇందులో రెండు ఛార్జింగ్‌ పోర్టులు ఉన్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం ఒకటి, స్లో ఛార్జింగ్‌ కోసం మరొకటని కంపెనీ తెలిపింది. అదనంగా ఎక్స్‌ఈ+ వేరియంట్‌లో రెండు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.  మూడు వేరియంట్లలో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టంతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వీటితో సిగ్నేచర్‌ ఈవీ డెకల్స్‌, ప్రీమియం ఫ్రంట్‌ గ్రిల్, స్టైలిష్‌ అలాయ్‌ వీల్స్‌, హైట్ అడ్జబుల్‌ సీట్‌, అర్మాన్‌ సౌండ్‌ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.   


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు