close

తాజా వార్తలు

పట్టాలు తప్పిన బీసీఎమ్‌.. పలు రైళ్లు రద్దు

మహబూబ్‌నగరం టౌన్‌: మహబూబ్‌నగర్‌ సమీపంలోని మన్నెంకొండ రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్‌పై బుధవారం సాయంత్రం  బీసీఎమ్‌ (కంకర శుభ్రం చేసే యంత్రం) పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. హైదారాబాద్‌ నుంచి ప్రత్యేక క్రేన్‌ తీసుకొచ్చి పట్టాలు తప్పిన బీసీఎమ్‌ యంత్రాన్ని పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ- చెన్నై చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను వాడి స్టేషన్‌ మీదుగా దారి మళ్లించారు. నాగర్‌కోయిల్‌- బెంగళూరు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఇదే మార్గంలో దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ-కర్నూలు టౌన్‌ ప్యాసింజర్‌ బాలానగర్‌ స్టేషన్‌ వరకు రాగా తిరిగి కాచిగూడ పంపించివేశారు. కాచిగూడ- గుంటూరు ప్యాసింజర్‌ మహబూబ్‌నగర్‌ స్టేషన్‌కు చేరుకోగా ప్రయాణికులను అక్కడే దింపేసి ఈ రైలును కూడా రద్దు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు