close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ కోరికలు తగ్గుతుంటే...

మెనోపాజ్‌ తరువాత చాలామంది మహిళల్లో లైంగికవాంఛలు తగ్గుతాయి. ఇందుకు సాధారణంగా ఎదురయ్యే కారణాలు, పరిష్కారాల గురించి తెలుసుకుందామా...

* ఈ దశలో చాలామంది మహిళలు కలయికకు దూరంగా ఉంటారు. జననాంగాలు పొడిబారాయని చెబుతుంటారు. దానికి కారణం ఈస్ట్రోజెన్‌ హార్మోను విడుదల ఆగిపోవడమే. జననేంద్రియాలకు రక్తప్రసరణ ఆగిపోయి... ఆ భాగం పొడిబారుతుంది.  ఈ సమస్యకు తరచూ కలయికలో పాల్గొనడమే పరిష్కారం. ఆ భాగాలకు రక్తప్రసరణ సజావుగా అందుతుంది.
* జననేంద్రియ భాగాలు పొడిబారినప్పుడు బాధపడాల్సిన అవసరంలేదు. సరైన ల్యూబ్రికెంట్‌ని ఎంచుకోవాలి. ఇప్పటివరకూ వాడకపోయినా... వైద్యుల సలహాతో సరైనదాన్ని వాడొచ్చు. కలయిక సౌకర్యంగా మారుతుంది.
* మెనోపాజ్‌ దశలో గర్భం రాదు కాబట్టి.. కండోమ్‌ వాడాల్సిన అవసరం లేదనుకుంటారు చాలామంది మహిళలు. గర్భం రాకపోవచ్చు కానీ... లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయని మరవకూడదు. కండోమ్‌ వాడటమే మంచిది.
* ఈ సమయంలో లైంగికవాంఛలు తగ్గడం మామూలే. భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడం... తరచూ కబుర్లు చెప్పడం, ఒకరిచేతిలో మరొకరు చెయ్యేసి నడవడం, వీలైనంత ఎక్కువ సమయం గడపడం వంటివి చేస్తే లైంగిక వాంఛలు కొంతవరకూ పెరుగుతాయి. వ్యాయామం చేస్తున్నా... ఫలితం ఉంటుందంటారు నిపుణులు.


మరిన్ని