close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దీపావళికి రంగోలీ

చూద్దాం - చేద్దాం

అభిరుచికి కాస్త సమయం కేటాయించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్ఛు అందుకు చక్కటి ఉదాహరణ హైదరాబాద్‌కి చెందిన రాయల సుభాషిణి. చమ్కీలు, కుందన్లు, పూసలు వంటివాటితో వర్ణ రంజితమైన రంగోలీలను దీపాల పండక్కి సిద్ధం చేశారు. ఏడేళ్ల క్రితం సరదాగా మొదలుపెట్టిన ఈ కళకు ఏటేటా మెరుగులద్దుకుంటూ ఎన్నో రంగవల్లికలు వేశారు. అలాంటి డిజైన్లలో ఇవి కొన్ని...

1,2 చిత్రాల్లో చూపించినట్లు ప్లాస్టిక్‌షీట్‌ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవాలి. దీనిపై వివిధ రకాల పూసలు, కుందన్లను డిజైన్‌ రూపంలో అతికించుకుని ఆరనివ్వాలి. ఇలా చేసినవాటిని వివిధ రంగవల్లులకోసం దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్ఛు ముగ్గులో...మిగిలిన ఖాళీలలో బీడ్స్‌, ముత్యాలు వంటివాటిని అలంకరించొచ్ఛు.


మరిన్ని