close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భద్రంగా జరుపుకుందాం

దీపావళిని భద్రంగా జరుపుకున్నప్పుడే సంబరం, సంతోషం. అందుకోసం ఈ జాగ్రత్తలు పాటించండి.

* పండగరోజు లేత రంగుల దుస్తుల్ని ఎంచుకోవద్ధు నూనె, పసుపూ వంటి మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు.

* దీపాలు పెట్టడం, మతాబులు కాల్చడం ఈ వేడుకకి ప్రత్యేకం. ఇలాంటప్పుడు సింథటిక్‌ నెట్‌, షిఫాన్‌, జార్జెట్‌ దుస్తుల జోలికి అస్సలు వెళ్లొద్ధు వీటికి తొందరగా మంటలంటుకుంటాయి. వీటికి బదులుగా చేనేత రకాలైన సిల్క్‌, ఖాదీ, పట్టు, లెనిన్‌, అహింసా సిల్క్‌, వెదురునారతో చేసిన వస్త్రాల్ని ఎంచుకుంటే సౌకర్యం, సురక్షితం.

* బాణాసంచా కాల్చే సమయంలో బూట్లు ధరించడం ఉత్తమం. పిల్లల్ని ఒంటరిగా టపాసుల్ని కాల్చనివ్వొద్ధు వీలైతే కళ్లకి అద్దాలు పెట్టండి.

* తక్కువ నాణ్యత కలిగిన టపాసులకు బదులు బ్రాండెడ్‌ ఉత్పత్తులను ప్రభుత్వ ఏజెన్సీలు, లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో కొనుగోలు చేయండి. తక్కువ నాణ్యత కలిగిన వాటిలో ప్రమాదకర రసాయనాలుంటాయి. . అవి చర్మానికి, కళ్లకు కీడు చేస్తాయి.

* ఇంటిలోపల, మూసేసినట్లుగా ఉన్న ప్రదేశాల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం. విద్యుత్‌ పరికరాలు, ఇతర వస్తువులు అగ్నిప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లోనే వీటిని కాల్చండి.

* ఇంట్లో దీపాలు, కొవ్వొత్తుల వరుసలు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. కర్టెన్లు, దుస్తులు, అగ్నిప్రమాదాల బారినపడే వస్తువులకు దూరంగా వెలిగించండి. దుపట్టాలు, లెహెంగాలు వంటి వాటిని ధరించినప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుని నడవండి.

● పటాసులు పేల్చే సమయంలో దగ్గర్లో తప్పకుండా ఒక బకెట్‌ నీటిని, ఇసుకని దగ్గర్లో ఉంచుకోండి. ఏవైనా దుర్ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే స్పందించి నివారించవచ్ఛు అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా...బ్యాండెయిడ్‌, యాంటీసెప్టిక్‌ లోషన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల్ని దగ్గర ఉంచుకోండి.


మరిన్ని