close

ఫీచర్ పేజీలు

ఓంకార యాత్ర

బుక్‌ నౌ

కార్తిక మాసం సందర్భంగా మధ్యప్రదేశ్‌ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. జ్యోతిర్లింగ క్షేత్రాలు ఓంకారేశ్వర్‌, ఉజ్జయినీ సందర్శనకు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ నుంచి రైలు ప్యాకేజీలు నిర్వహిస్తోంది. ఈ యాత్ర హైదరాబాద్‌ నుంచి బుధవారం, విజయవాడ నుంచి శుక్రవారం మొదలవుతుంది.

ఓంకారేశ్వర్‌లో.. నర్మదా నదీ స్నానం, ఓంకారేశ్వరాలయం ఇతర ప్రముఖ ప్రదేశాలు చూపిస్తారు.

ఉజ్జయినీలో.. మహాకాలేశ్వరాలయం (భస్మహారతి), బడా గణేష్‌, హరసిద్ధి మాత, కాలభైరవ, చింతామణి గణపతి తదితర ఆలయాలు చూపిస్తారు.

వీటితో పాటు ఉజ్జయినీకి 70 కి.మీ. దూరంలో ఉండే మహేశ్వర్‌కు తీసుకెళ్తారు.

ప్యాకేజీ కనీస ధర

హైదరాబాద్‌ నుంచి రూ.11,250 (ఒక్కరికి)

విజయవాడ నుంచి రూ.9,900 (ఒక్కరికి)

ఏసీ త్రీటైర్‌ రైలు టికెట్లు, ఏసీ గదిలో బస, సైట్‌ సీయింగ్‌కు ఏసీ కారులో ప్రయాణం, ఉపాహారం, రాత్రి భోజనం ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.

మరిన్ని వివరాలకు 98660 69000 ఫోన్‌నెంబర్‌ను సంప్రదించండి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు