close

ఫీచర్ పేజీలు

మిలన్‌ మిలమిలలు!

సందర్భం

కాన్సెప్ట్‌ బైక్‌లు.. నమూనా వాహనాలు.. రాబోయే కొత్త మోటార్‌సైకిళ్లు.. అన్నీ కొలువుదీరే వేదిక ఇటలీలోని మిలన్‌. ఏటా ఇక్కడ జరిగే ఈఐసీఎంఏ (ఐక్మా) ప్రదర్శనకి ఎంతో పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు చాలా పరిశోధనలు చేసి  తయారు చేసిన మోడళ్లు ఇక్కడ దర్శనమిస్తుంటాయి.  రెండ్రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రదర్శనలో అలాంటివెన్నో కొలువుదీరాయి. అందులో బాగా ఆకట్టుకున్న కొన్ని ద్విచక్రవాహనాలు.. వాటి ప్రత్యేకతలు.


హీరో ఎక్స్‌ట్రీమ్‌ 1.ఆర్‌ కాన్సెప్ట్‌

కేటీఎం200 డ్యూక్‌, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 200లకు పోటీనిచ్చేందుకు హీరో మోటోకార్ప్‌ తయారు చేసిన బండి ఇది. మేటి పికప్‌, తేలికైన హ్యాండ్లింగ్‌ లక్ష్యంగా తయారు చేసినట్టు చెబుతోంది హీరో కంపెనీ.


ఏప్రిలియా ఆర్‌660 సూపర్‌స్పోర్ట్‌

మిడిల్‌వెయిట్‌ సెగ్మెంట్‌లో దూసుకొచ్చింది. ఆసియా మార్కెట్ల కోసం తయారు చేశామంటోంది. డబుల్‌ ఫేరింగ్‌లు, ఏరోడైనమిక్స్‌, కిందికి దిగిన ఎగ్జాస్ట్‌ పైపు, 270 డిగ్రీల క్రాంక్‌షాఫ్ట్‌, క్రూజ్‌ కంట్రోల్‌, రైడర్‌ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమయ్యే ఐదంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ ప్రత్యేకతలు.


కేటీఎం 390 అడ్వెంచర్‌

ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న కేటీఎం అడ్వెంచర్‌ బైక్‌ ఎట్టకేలకు జనం ముందుకొచ్చింది. కేటీఎం 390 అడ్వెంచర్‌ పేరుతో మిలన్‌ వాహన ప్రదర్శనలో తళుక్కుమంది. మరో ఆరునెలల్లో దీన్ని భారతీయ రోడ్లపైకి తీసుకొస్తామంటోంది కేటీఎం


హీరో ఎక్స్‌పల్స్‌ 200

తక్కువధరలో అందుబాటులో ఉన్న అడ్వెంచర్‌ బైక్‌ ఇది. భారీ మార్పులు చేసి ‘ర్యాలీ కిట్‌’ పేరుతో మిలన్‌లో ప్రదర్శించారు. సస్పెన్షన్‌, గ్రౌండ్‌ క్లియరెన్స్‌, సీటింగ్‌, బ్రేక్‌ పెడల్‌, టైర్లు.. ఇలా కీలకమైన అన్ని విభాగాలను అప్‌గ్రేడ్‌ చేశారు.


హోండా సీబీఆర్‌ 1000ఆర్‌ఆర్‌-ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌

రేస్‌ ట్రాక్‌లో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న బైక్‌ హోండా సీబీఆర్‌ 1000ఆర్‌ఆర్‌-ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌, ఫైర్‌బ్లేడ్‌ ఎస్‌పీలు. వీటికి మరిన్ని మెరుగులద్ది తీసుకొచ్చారు. డిజైన్‌, టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేశారు. భద్రతా ఫీచర్లు జోడించారు. వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లోకి రానుంది.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు