close

వసుంధర

ఆరోగ్యానికి అవిసె గింజలు

మన వంటింట్లో దొరికే చాలా పదార్థాలు ఆరోగ్యాన్నే కాదు... అందాన్నీ ఇస్తాయి. ముఖ్యంగా అవిసెగింజలు రోజూ తీసుకుంటే  కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
* అవిసెగింజల్లో ఉండే మ్యుకిలేజ్‌గమ్‌ ...జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఇందులోని పీచు శరీరాన్ని డీటాక్సిఫికేషన్‌ చేస్తుంది.
* ఈ గింజల నుంచి లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు... మలబద్ధకాన్ని నివారిస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పోషకాలు... హార్మోన్లను సమతూకంలో ఉండేలా చేస్తాయి. నెలసరి క్రమంగా వచ్చేలా  చూస్తాయి. అండాశయ, రొమ్ము క్యాన్సర్‌ నిరోధానికి తోడ్పడతాయి.
* అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్‌ మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఈస్ట్రోజన్‌ గుణాలు ఎక్కువ. వీటిని తీసుకునేవారిలో ఆస్టియోపొరోసిస్‌ సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని బి విటమిన్లు శరీరం పొడిబారే తత్వాన్ని తగ్గించి జుట్టు, చర్మం తేమగా కనిపించేలా చేస్తాయి.
* ఈ ఫలితాలన్నీ మీ సొంతం కావాలంటే రోజూ రెండు చెంచాల అవిసెగింజల్ని ఆహారరూపంలో తీసుకోవచ్చు. వీటిని నూనె లేకుండా దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో దీన్ని కలిపితే చాలు. చపాతీపిండి, కూరలు, పప్పు... ఇలా దేంట్లోనైనా వేసుకోవచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు