close

తాజా వార్తలు

ఒకడు రావాలని దేవుడు డిసైడ్‌ అయితే..!

‘విజయ్‌ సేతుపతి’ టీజర్‌ చూశారా

హైదరాబాద్‌: తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి నటించిన సినిమా ‘సంగ తమిళన్‌’. విజయ్‌ చందర్‌ దర్శకుడు. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. హర్షిత మూవీస్‌ నిర్మించింది. తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’ పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర తెలుగు టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

‘నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వు ఇలా నాకే ఎదురు తిరిగి, నా ముందే పోటుగాడిలా నిల్చుంటావని నేను కలలో కూడా అనుకోలేదు రా..’ అని విలన్‌ అంటున్న డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది. ‘ఒకడు రావాలని దేవుడు డిసైడ్‌ అయిపోయాడే అనుకో.. మీరు ఎంత గేటు మూసి, తాళం పెట్టి లాక్‌ చేయాలన్నా కుదరదు.. ఎందుకో చెప్పనా, తాళం చెవి ఆయన దగ్గర ఉంది’ అంటూ విజయ్‌ ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ విసిరారు. మాస్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు