close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వాడినపూలతో...ధూప్‌కోన్స్‌!

పూజకు వాడిన పూలను మర్నాడు తీసేస్తాం. ఇకపై వాటిని చెత్తబుట్టలో పారేయకండి. ఆ పూలతో ఇంట్లోనే ధూప్‌కోన్స్‌ సులువుగా చేసుకోవచ్చు. ఎలాగంటే...
* పూలను ఎండలో ఉంచితే రెండుమూడు రోజులకు పూర్తిగా ఎండిపోతాయి. తరువాత వాటిని పొడి చేసుకొని... రంపపు పొట్టు, కొబ్బరి పీచు, బొగ్గు పొడి, సాంబ్రాణి వంటి వాటిని  కలపాలి.
* ఈ మిశ్రమంలో సాధారణ లేదా గులాబీ నీటిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తరువాత మనకు నచ్చిన ఆకృతిలో వీటిని ధూప్‌కోన్స్‌గా మలచుకోవచ్చు.
* ఇలా చేసుకున్నవాటిని నాలుగు నుంచి అయిదు రోజుల పాటు ఎండలో ఉంచితే... ధూప్‌కోన్స్‌ తయారైనట్లే. ఈ పూలతోపాటు వేప, మెంతి, కరివేపాకు ఎండబెట్టి... వీటి తయారీలో వాడితే ఇంట్లో దోమల బెడద ఉండదు. వీటిని వెలిగించినప్పుడు సువాసన రావాలనుకుంటే ఏదైనా అరోమా నూనె కొన్ని చుక్కలు వేయొచ్చు. వీటినుంచి వచ్చిన బూడిదనూ పారేయకుండా మొక్కలకు వేస్తే... అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.

పద్మినీ రంగరాజన్‌, హైదరాబాద్‌


మరిన్ని