close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కోటుతో క్యూటుగా

కోటు... పాశ్చాత్య శైలికి పెట్టింది పేరైనా    దానికి దేశీలుక్‌ని కలిపేస్తూ ఆధునికంగా మార్చేస్తున్నారు డిజైనర్లు.  శీతాకాలానికి అనువుగా ఉండే ఈ కోటును ఎవరు... ఎలా ఎంచుకోవచ్చో తెలుసుకుందాం.
* సాధారణంగా ఇది వెయిస్ట్‌ లైన్‌, దాని కిందవరకూ ఉంటుంది. ఒకప్పుడు ఇవి చాలావరకూ డెనిమ్‌, లెదర్‌, రేయాన్‌ వంటి రకాల్లో మాత్రమే లభించేవి. ఇప్పుడు మనం వేసుకునే దుస్తులకు మ్యాచింగ్‌గా అన్ని రకాల వస్త్రాల్లోనూ దొరుకుతున్నాయి. కలంకారీ, కచ్‌, చికెన్‌కారీ, జర్దోసి, అద్దాలు వంటి ఎంబ్రాయిడరీ హంగుల్లోనూ ఆకట్టుకుంటున్నాయి. బెనారస్‌, కంచి... వంటి పట్టు కోట్‌లూ మెరిపిస్తున్నాయి.
* పలాజోల మీదకు పొడవాటి నెట్‌, ఫ్యాన్సీ కోట్‌లు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. వీటిని పార్టీవేర్‌గా ఎంచుకుంటే స్టైలిష్‌ లుక్‌ మీ సొంతమైనట్లే.
* ఇప్పుడు అమ్మాయిల హాట్‌ ఫేవరెట్‌ స్కర్టులే. వీటికి పూలతో డిజైను చేసిన లాంగ్‌ కోటులు బాగుంటాయి. సాధారణంగా స్కర్టుల మీదకు కోటుల్ని ఎంచుకునేటప్పుడు షిఫాన్‌, నెట్‌ వంటి రకాల్ని ప్రయత్నించాలి. భారీ పనితనం ఉన్న స్కర్టుల మీదకు తక్కువ ఎంబ్రాయిడరీతో ఉండేవి నప్పుతాయి.  
* డెనిమ్స్‌ మీదకు కలంకారీ, ఇకత్‌ వంటి హ్యాండ్‌లూమ్‌ రకాలు నప్పుతాయి. కాస్త లావుగా ఉండేవారికి ఇది చక్కటి స్టైలింగ్‌ ఇస్తుంది. సన్నగా ఉండేవారు తమ ఆకృతి కనిపించాలనుకుంటే బెల్ట్‌ని వాడొచ్చు.
* ఏ-లైన్‌ కుర్తాలు, ట్యూనిక్‌ల మీదకు షిఫాన్స్‌, జార్జెట్స్‌, సిల్క్‌ లాంగ్‌ కోటులు బాగుంటాయి. ఫ్లోరల్‌ అనార్కలీ మీదకు ప్లెయిన్‌ రకం నప్పుతుంది. అదే ప్లెయిన్‌ అనార్కలీని ఎంచుకుంటే...దానికి భిన్నంగా కోటు ఉండేలా చూసుకోవాలి.
* జీన్స్‌, పలాజో, జెగ్గింగ్‌, గౌను, క్రాప్‌టాప్‌-స్కర్టు... వేటిమీదకైనా సరే ట్రెండీగా కనిపించడానికి పొడవాటి కోటుని ఎంచుకోవడం హాటెస్ట్‌ ట్రెండ్‌. అయితే మ్యాక్సీలా కనిపించకుండా సింగిల్‌ హుక్‌ పెట్టుకోవచ్చు. సన్నటి లెదర్‌ బెల్ట్‌నీ వాడొచ్చు.


మరిన్ని