close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నిద్ర పట్టట్లేదా?

శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. 
* శారీరక శ్రమకు దూరంగా ఉండేవారికి గాఢనిద్ర వచ్చే అవకాశాలు తక్కువ. రోజూ కనీసం అరగంట నడక, వ్యాయామాలు, ఆసనాలు వంటివి ప్రయత్నిస్తే శరీరం  అలసిపోతుంది. ఆటంకం లేకుండా నిద్రపడుతుంది.
* కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌తోనూ నిద్ర సరిగా పట్టకపోవచ్చు. వీటిని మితంగా తీసుకోవాలి. రాత్రి భోజనం తరువాత టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.
* టీవీలు, ఫోన్లు, కంప్యూటర్‌ తెరలు విడుదల చేసే నీలిరంగు కాంతి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. పడుకోవడానికి గంట ముందే వీటికి దూరంగా ఉండాలి.
* నిద్ర వేళలు రోజూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. పడుకోవడానికి గంట ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే... కాసేపటికే నిద్రపడుతుంది.
* నిద్రలేమితో బాధపడేవారు రాత్రివేళ ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మార్పు కనిపించొచ్చు. మధ్యాహ్నం కునుకు తీయడమూ మానేయాలి.


మరిన్ని