close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మహిళలు టాయిలెట్లు కట్టేస్తున్నారు!

వేల రూపాయలు వెచ్చించి శౌచాలయాలు నిర్మించుకునే స్థోమత లేని వారికి ఓ సంస్థ సామాజిక బాధ్యత కింద పరిష్కారం చూపించింది.  అచ్చుల సాయంతో వాటిని నిర్మించుకునేలా ఆ ఇంజినీర్లు మహిళలకు శిక్షణ ఇస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆ సంస్థ ఇంజినీర్ల ఆలోచనే ఇది. కేరళలోని అమ్రిత యూనివర్సిటీ కేంద్రంగా పరిశోధనలు చేసి... ఇటుకల అవసరం లేకుండా త్రీడీ నమూనాలో అచ్చుల సాయంతో కొన్నాళ్ల క్రితం ఒక శౌచాలయాన్ని నిర్మించారు. ఇది ఫలించడంతో గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి, వారే సొంతంగా నిర్మించుకునేలా తర్ఫీదు ఇచ్చారు. ఈ విధానంలో ఇటుకలు, ప్లాస్టరింగ్‌ అవసరం లేదు. పునాదులు, గోడలు నిర్మించడానికి  అచ్చులు ఉంటాయి. వీటిని అడ్డు, నిలువు వరుసల్లో క్రమ పద్ధతిలో బోల్టులతో బిగించి, మధ్యలో కాంక్రీటు మిశ్రమం వేస్తే చాలు. ఖర్చు, సమయం ఆదా అవుతాయి. ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాల్లో రెండొందల మందికి పైగా మహిళలు ఇందులో శిక్షణ పొందారు. వీరు ఆ తరువాత స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో వేలమంది మహిళలు నాలుగు వందలకు పైగా టాయిలెట్లు నిర్మించారు.


మరిన్ని