close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బొద్దుగుమ్మ సన్నజాజిలా!

సన్నగా కనిపించాలని చాలా ప్రయత్నాలే చేస్తాం. ఇలాంటివారు దుస్తుల్ని ఎంచుకునేటప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
* లావుగా ఉన్నవారు....ఏ భాగాల్లో ఆ సమస్య ఎక్కువగా ఉందో దాన్నుంచి దృష్టిమరల్చేందుకు మరో వైపు ఆకర్షణీయమైన డిజైన్లు, ప్రింట్లు వచ్చేలా చూసుకోవాలి. వీరికి ముదురు రంగు దుస్తులు నప్పుతాయి బిగుతుగా ఉండే దుస్తుల జోలికి పోకూడదు.
* బొద్దుగా ఉండేవారు లేయర్డ్‌ రకాలు వేసుకోవద్దు. వీరికి స్ట్రెయిట్‌కట్‌ నప్పుతుంది. పొట్టిగానూ ఉంటే ఏ లైన్‌ రకాల్ని ఎంచుకోవచ్చు.
* నడుముభాగం సన్నగా కనిపించేందుకు స్లిమ్‌ఫిట్‌ రకాలు వేసుకోండి. కుర్తీలు, ట్యూనిక్‌లు ఇలా అన్నింట్లోనూ ఈ తరహావి దొరుకుతాయి. స్కిన్నీ జీన్స్‌, లెగ్గింగ్‌ వంటివీ ప్రయత్నించొచ్చు.
* ఎత్తుమడమల చెప్పులు శరీరం సరైన ఆకృతిలో కనిపించేలా చేస్తాయి. ఇవి వేసుకోవడం అలవాటు లేకపోతే.. వెడ్జెస్‌ సౌకర్యంగా ఉంటాయి.
* మీ మెడ పొడుగ్గా, సన్నగా ఉంటే... హై నెక్‌లైన్స్‌ ఉన్న దుస్తుల్ని ఎంచుకోవాలి. గుండ్రటి మెడ సైతం సరిపోతుంది. లేదంటే ఆంగ్ల వి ఆకృతిలో ఉండే మెడ డిజైను ఉన్న దుస్తులకు ప్రాధాన్యం ఇస్తే చక్కగా కనిపిస్తారు.


మరిన్ని