close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఖాళీగా ఉన్నారా?

మెదడు చురుగ్గా ఉండటానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కింది చిట్కాలూ పాటించండి.

రోజూ వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మానసిక ఆరోగ్యం బాగుం టుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు చేసే వ్యాయామాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌, యోగా, పరుగు... ఇలా అన్నీ ఉండేలా చూసుకోవాలి.

ఖాళీ సమయాల్లో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పదవినోదం, సుడోకు వంటివాటినీ ప్రయత్నించొచ్ఛు కొత్త భాషలు నేర్చుకున్నా ప్రయోజనం ఉంటుంది.

వేళకు సరైన పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, పాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజంతా చురుగ్గా ఉండాలంటే... ఎనిమిది గంటలు తప్పకుండా నిద్రపోవాలి.

తీరిక వేళల్లో సంగీతం వినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇది మీ మూడ్‌ను మెరుగు పరుస్తుంది. మీకు కలిగే అనుభూతులు, ఉద్వేగాలను ఒక చోట రాసుకోండి. వాటిని గమనించుకుంటే... మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు.

తీరిక వేళల్లో పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి. కథలు, ఇతర అంశాలు మీలోని ఊహాశక్తిని పెంచి మెదడుకు పదును పెడతాయి.


మరిన్ని