close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పొరపాట్లు దిద్దుకునేలా!

మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే... విధుల్లో వెనకడుగు వేసేలా చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి. అవేంటి, వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా...

* పనిచేసుకుంటూ వెళ్లిపోవడం మంచిదే కానీ... కాస్త అవగాహన లేకపోతే వెనకుండిపోతాం. మీరు ఎంచుకొన్న రంగంలో మీకంటూ నెట్‌వర్క్‌ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేయండి. వాళ్లు అందించే సూచనలు మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి.
* కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మీరు ఏ పనైనా చేయగలరనే నమ్మకాన్ని యాజమాన్యానికి కలిగించాలి. అప్పుడే మీపై సానుకూల దృక్పథం కలుగుతుంది.
* వైఫల్యం అనేది ఎక్కడైనా మామూలే. దాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చుంటే...మీకంటూ ఎదుగుదల ఉండదు. కారణాలూ వెతకొద్దు. మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనేది ఆలోచించండి. గతంలో సాధించిన విజయాలూ గుర్తుచేసుకుంటే కుంగుబాటు ఉండదు.
* పై అధికారులు ఇచ్చే సమీక్ష... మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రశంసించినప్పుడు ఆనందపడటం, విమర్శించినప్పుడు కుంగిపోవడం చాలామంది చేసేదే కానీ... వద్దు. ముందు రెండింటినీ సమానంగా తీసుకోండి. మిమ్మల్ని విమర్శించినప్పుడు దాన్నుంచి మీరేం నేర్చుకుంటారనేది పరిగణించండి. ఆ పొరపాటు మరోసారి చేయకుండా చూసుకోండి.


మరిన్ని