close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫోనుతో... పోలీసులొస్తారు

చీకటి పడితే, ఇంటికి చేరుకోవడానికి వాహనం దొరకకపోయినా, సొంత వాహనం మరమ్మతుకు గురైనా... మహిళలకు ఇబ్బందే. దాన్ని గుర్తించిన లుథియానా పోలీసులు అక్కడి మహిళలకు ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సరే... తాము ఇబ్బందిలో ఉన్నామని ఫోన్‌ చేస్తే... తక్కువ సమయంలోనే ఆ పోలీసులు అక్కడకు చేరుకుని... ఆ మహిళల్ని గమ్యానికి క్షేమంగా చేరుస్తారు ఈ ఉచిత సేవలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటనతో అక్కడి మహిళలకు రక్షణ కల్పించే దిశగా అక్కడి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హెల్ప్‌లైన్‌నెంబర్లనూ ప్రకటించారు. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల్లోపు ఒంటరి మహిళలకు ఈ సేవలు అందుతాయి. దీంతోపాటు అక్కడ ఇప్పటికే శక్తి పేరుతో ‘రక్షణ’ యాప్‌ సైతం అందుబాటులో ఉంది.

మరిన్ని