close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఉల్లి బదులు... క్యాబేజీ!

ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావడం ఒకప్పుడు... ప్రస్తుతం కొనాలంటేనే ఆ పరిస్థితి. మార్కెట్లో దీని ధర రోజురోజుకూ పెరుగుతోంది... దీనికి ప్రత్యామ్నాయంగా ఏం ఎంచుకోవచ్చో చూద్దామా!
ఉల్లి రుచిని మరిపించే పదార్థాల్లో క్యాబేజీ ఒకటి. కూర రుచిని పెంచడంలో, గ్రేవీ కోసం క్యాబేజీని వాడుకోవచ్చు.

* ఉల్లి ముక్కలకు బదులుగా సెనగపిండి, పెరుగు కలిపి చూడండి. ఈ రెండింటి మిశ్రమం వల్ల కూరకు  గ్రేవీతోపాటు, రుచి కూడా పెరుగుతుంది.
* టొమాటోలూ, ఉల్లికాడలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు.
* ఉల్లిపాయలనే కాదు సన్నగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలని కూడా గ్రేవీకోసం ఉపయోగించుకోవచ్చు.
* గుమ్మడిగింజలు, నువ్వులు వంటివి కూడా చక్కని ప్రత్యామ్నాయాలే!


మరిన్ని