close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈగల్‌ 2.0 రోబో టీచరమ్మ!

ఆ తరగతి గదిలో పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని అక్కడి విద్యార్థులందరూ ఆసక్తిగా  గమనిస్తున్నారు. ఎందుకంటే ఆమె మామూలు టీచరమ్మ కాదు మరి. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పాఠాలు చెబుతూ పిల్లలందరినీ హలో అంటూ పలకరిస్తున్న ఈ రోబో పేరు ‘ఈగల్‌ 2.0’

మానవరూపంలో అయిదడుగుల ఏడంగుళాల ఎత్తులో, ఫార్మల్‌ డ్రెస్‌ ధరించే ఈ రోబో టీచర్‌ ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఆ స్కూల్లో ప్రతి రోజూ నాలుగు తరగతులని నిర్వహిస్తోంది.  పిల్లల నుంచి ప్రశ్నలను తీసుకుని, వాటికి సమాధానం చెబుతోంది. స్క్రీన్‌పై పవర్‌ పాయింట్‌తో వారి సందేహాలను తీరుస్తోంది. ఏడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు భౌతిక, రసాయన, జీవశాస్త్రం తదితర పాఠ్యాంశాల్లో ఆయా తరగతుల ఉపాధ్యాయులకు సాయంగా విధులు చేపడుతోంది. ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నేతృత్వంలో నిర్వహించే పైలట్‌ ప్రాజెక్ట్‌ మేరకు.. ఉపాధ్యాయులు సెలవు తీసుకున్న సందర్భాల్లో ఈ రోబో టీచర్‌ బాధ్యతవహిస్తుంది. దీంతోపాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను రోబో రూపంలో ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు అందించే దిశగా ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం విశేషం.

17 మంది...
ఈగల్‌ 2.0 రోబోను 17 మంది సాంకేతిక నిపుణులు రూపొందించారు. వీరిలో ఐఐటీ పూర్వవిద్యార్థులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, గ్రాఫిక్‌ డిజైనర్లు, యానిమేషన్‌, గేమింగ్‌ ప్రోగ్రామర్లు ఉన్నారు. చైనాలో రోబో తయారీ నైపుణ్యాలపై వీరంతా రెండు నెలలపాటు శిక్షణ పొందారు. దాదాపు రెండేళ్లపాటు ఈ రోబోను టీచర్‌గా మానవరూపంలో తీసుకురావడానికి తీవ్ర కృషి చేశారు. ఈ తరహాలో మూడింటిని రూపొందించగా, ఒక్కొక్కదానికి ఎనిమిది లక్షల రూపాయల వ్యయమైంది.


మరిన్ని