close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రన్‌ బామ్మ రన్‌

బామ్మ.. వయసులో సెంచరీ దాటేసింది. అయినా చెలరేగే ఉత్సాహంతో పరుగులు పెడుతూనే ఉంది. ఆమె సంకల్పానికి, సాహసానికి ఎన్నో రికార్డులు సలాం కొట్టాయి. ఆమే పటియాలాకు చెందిన మన్‌ కౌర్‌. ఫిట్‌ ఇండియా ఉద్యమం కోసం విశాఖపట్టణం వచ్చి ఒకటిన్నర కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు.

వయసులో పెద్దవాళ్లకి వరల్డ్‌ మాస్టర్‌ గేమ్స్‌ పేరుతో పోటీలు నిర్వహిస్తుంటారు. ఎనిమిదేళ్ల కిందట ఓసారి ఇలాగే పోటీలు జరుగుతున్నప్పుడు మన్‌ కౌర్‌ కుమారుడు గురుదేవ్‌ సింగ్‌కి తెలిసింది. అప్పటికి ఆమె వయసు 93 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులు, గుండె సంబంధ ఇబ్బందుల్లేవు. కొడుకే కోచ్‌లా మారాడు. బామ్మ పరుగుల సాధన మొదలైంది. కొన్నాళ్ల తర్వాత మొదలైన తొలి పోటీ నుంచే ప్రతి ఈవెంట్‌లో పతకాల పంట పండిస్తున్నారు. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో 100మీటర్ల పరుగును 74 సెకన్లలో పూర్తి చేసి అంతకుముందున్న 81 సెకన్ల రికార్డును బద్దలు కొట్టారు. 200మీటర్ల విభాగంలోనూ గెలిచి బంగారు పతకం అందుకున్నారు. మన్‌ కౌర్‌కి జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లోనూ ప్రావీణ్యం ఉంది.

రోజూ ఉదయం క్రమం తప్పకుండా పాలు తాగడం, మొలకెత్తిన గోధుమ గింజలతో చేసిన చూర్ణాన్ని ఆహారంగా తీసుకోవడం, రెండు పూటలా చపాతీలతో తినడమే నా ఆరోగ్య రహస్యం అంటారామె.

-డి.లక్ష్మీనర్సయ్య, ఈనాడు జర్నలిజం స్కూల్‌


మరిన్ని