close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్లాస్టిక్‌ వాడకం తగ్గిద్దామిలా!

వారంలో ఒక మనిషి సుమారుగా ఐదు గ్రాముల ప్లాస్టిక్‌ తీసుకుంటున్నాడని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. తినే పదార్థాలను భద్రపరచడం మొదలు ఇంట్లో వాడే ఏ వస్తువైనా ప్లాస్టిక్‌తో చేసింది వినియోగించడమే ఇందుకు కారణం. ఇది ఎన్నో రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. ప్లాస్టిక్‌ రహిత జీవనశైలిని అలవాటు చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి.
* వంటింట్లో పప్పులు, పోపు సామగ్రిని భద్రపరచడానికి ఇప్పుడంతా ప్లాస్టిక్‌ డబ్బాలనే వినియోగిస్తున్నారు. ఇక ముందు వీటి స్థానంలో గాజు సీసాలు, స్టీలు డబ్బాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇవి తేమని దరిచేరనివ్వవు. ఎక్కువకాలం మన్నికగానూ ఉంటాయి.
* సౌకర్యంగా ఉన్నాయి కదా! అని అంతా ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలకే ఓటేస్తున్నాం. కానీ దీర్ఘకాలం వీటిని వాడటం అంత మంచిది కాదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాటి స్థానంలో గాజు, స్టీలు, ఇత్తడి, రాగి బాటిల్స్‌ని వాడండి. ఆరోగ్యానికీ ఎంతో మేలు. ఆఫీసులకి, పాఠశాలలకి ప్లాస్టిక్‌ డబ్బాలకు బదులు స్టీలు క్యారియర్లను ఎంచుకోండి. వేడివేడి పదార్థాల్ని ప్లాస్టిక్‌ వాటిల్లో వేసి మూతపెట్టడం వల్ల మనకు తెలియకుండానే ప్లాస్టిక్‌ నోట్లోకి వెళ్లిపోతోంది.
* ప్లాస్టిక్‌ కప్పుల్లో టీలు, కాఫీలు తాగే అలవాటును మానుకోండి. గాజు, పింగాణి, వెదురు, మట్టి కప్పులే వినియోగించండి. ఇవి రుచినీ పెంచుతాయి.
* ఇంట్లో జరిగే వేడుకలను ప్లాస్టిక్‌ రహితంగా చేసుకోండి. అరిటాకుల్లో భోజనం, స్టీలు గ్లాసుల్లో మంచినీళ్లు, మట్టి కప్పులు... ఇలా ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ని నిరోధించి అందరికీ ఆదర్శంగా ఉండండి.
* కూరగాయల్ని, పండ్లను ప్లాస్టిక్‌ కవర్లలో తెస్తుంటాం. ఈ సారి ఎక్కడికి వెళ్లినా వెంట నార, వస్త్రంతో చేసిన ఓ సంచి తీసుకెళ్లండి. చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వంటివి వినియోగించడం మేలు.


మరిన్ని