close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంగువ లాభాలు!

ఇంగువ...  ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం. పొడిగా... ముద్దగా... రెండు రకాల్లో లభ్యమవుతుంది. పులిహోర, రసం, సాంబారు, పచ్చళ్లు... అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. దీని మరిన్ని ప్రయోజనాలు...

* ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాసు, కడుపు ఉబ్బరం... లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* ఈ పొడిలోని యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి.
* సెనగగింజ పరిమాణంలో బెల్లం మధ్యలో పెట్టి తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది.
* కప్పు నీళ్లను బాగా మరిగించి, చిటికెడు ఇంగువ వేసి రోజులో రెండు మూడు సార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది.
* సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తీసుకుంటే నులిపురుగుల సమస్య ఉండదు.
* అన్నంలో మొదటి ముద్దను.. నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలుండవు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు అవుతాయి.

- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


మరిన్ని