close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వందేమాతరం..150 రాగాల్లో!


ఆ చిన్నారి పాడితే కోకిలైనా చిన్నబోతుంది...ఇప్పుడామె నోట దేశభక్తి 150 రాగాలై పల్లవించింది. ఆ చిన్నారే అత్తలూరి ప్రవస్తి...

ప్రవస్తి మూడేళ్ల వయసు నుంచే మాటలతో పాటు పాటలూ నేర్చుకుంది. టీవీ, బయట కార్యక్రమాల్లో విన్న స్వరాలను చక్కని గాత్రంతో పాడేది.ఎన్నో పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ప్రవస్తి ప్రతిభను గుర్తించిన ఓ సంస్థ... ఆమె గొంతు నచ్చి 150 రాగాలతో వందేమాతం గీతాన్ని ఆలపించమని కోరింది. అప్పటి నుంచి మొదలు నాలుగు నెలల్లో తానే 150 రాగాలు స్వరపరిచి ఆలపించింది. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేసేది. రాగం ఎంత కఠినంగా ఉన్నా సరే... రోజులో ఇరవై రాగాల్లో వందేమాతరాన్ని పాడేది. ప్రవస్తి తల్లి గృహిణి. తండ్రి ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి. తన వయసు పిల్లలందరూ ఆడుతూ పాడుతూ ఉంటే... ఆమె మాత్రం రోజూ ఉదయం అయిదు గంటలకే నిద్ర లేస్తుంది. సంగీతం సాధన చేస్తుంది. అనేక రకాల పాటలు వింటూ దాన్ని ఎలా స్వరపరిచారు... ఇంకా దాన్ని ఎలా మార్పు చేయొచ్చో రాసిపెట్టుకుంటుంది.


మరిన్ని