close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ బ్యాంకు... లోదుస్తుల కోసం!

ఉపయోగించని, పాత బ్రాలను ఏం చేస్తాం? ఏం చేస్తాం.. చెత్తబుట్టలో పారేస్తాం. కానీ అమెరికా, లండన్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో మాత్రం వీటిని ఓ డ్రాప్‌ బాక్సులో వేస్తారు. ఎందుకంటే అవి పేద మహిళలకు ఉపాధినిస్తాయి కాబట్టి...
ప్యాడెడ్‌ లేదా కొన్ని రకాల వస్త్రాలతో చేసిన బ్రాలు భూమిలో అంత త్వరగా కలిసిపోవు. పర్యావరణానికి చేటు చేస్తాయి కూడా. అందుకే వీటిని రీసైక్లింగ్‌ చేయడం, లేదా అవసరం ఉన్న వారికి ఇవ్వడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయి ఫ్రీ ద గర్ల్స్‌, హాన్స్‌బ్రాండ్స్‌ వంటి సంస్థలు. వినియోగించని, పాత బ్రాలను వేయడానికి పెద్దపెద్ద దుకాణాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో బ్రా బ్యాంక్‌, పింక్‌ క్లాతింగ్‌ బ్యాంక్‌ పేరుతో డ్రాప్‌ బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరైనా వీటిల్లో వారు వినియోగించని లోదుస్తులను వేసేయొచ్చు. పాతవయితే సరైన పద్ధతిలో మహిళలే రీసైక్లింగ్‌ చేస్తారు. అందులోని లోహపు వైర్లని వెలికితీసి విక్రయించి ఉపాధిపొందుతున్నారు. వాడటానికి అనువుగా ఉన్న వాటిని అనాథాశ్రమాల్లో ఉండే నిరుపేద బాలికలకు ఇస్తారు.


మరిన్ని