close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గ్లాసుల కోసంఓ బ్యాంకు!

పెళ్లైనా.. పేరంటం అయినా... భోజనాలనేసరికి ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులే గుర్తొస్తాయి... ఇవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి.. దీని నుంచి బయట పడటానికి గుడ్‌గావ్‌కు చెందిన సమీర ఏం చేస్తుందో తెలుసా?

చాలా మంది అన్నదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండటం మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. ఇవి మంచి పనులే అయినా... వీటిని నిర్వర్తించడానికి ఎక్కువ మంది ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులే వాడుతుంటారు. ఇవి భూమిలో అంత త్వరగా కలిసిపోవు. చుట్టుపక్కలకు వ్యాపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలు జరిగినా ఇదే పరిస్థితి. ఇలాంటి ఎన్నో సంఘటనలు చూసి విసిగివేసారి పోయింది సమీర. ఆమె కాగ్‌లో పనిచేస్తుంది. ప్లాస్టిక్‌కు బదులు స్టీల్‌ వస్తువులు కొనాలని, వాటిని మళ్లీ వినియోగించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించింది. ఆమె మాటలు ఎవరూ వినలేదు. అప్పుడే ఆమెకు ‘క్రోకరీ బ్యాంక్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌’ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సొంతంగా స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసింది. ఈ సంస్థ ద్వారా వేడుకలకు అవసరమైన స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు అందిస్తోంది. వీటిని మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్ఛు పర్యావరణానికీ హాని కలిగించవు. దిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో ఆమె సేవలందిస్తోంది. అంతేకాదు... పాత్రలను పర్యావరణ హితంగా ఎలా శుభ్రం చేయాలో ఆమె నేర్పిస్తోంది. ‘ప్రతిదానికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదు... మనం ఏం చేస్తున్నామనేదే ముఖ్యం. మంచిపనైనా సరే... ప్లాస్టిక్‌ వాడకుండా చేయాలి. ఇదే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించాన’ంటోంది సమీర.


మరిన్ని