close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కంటికి పసందుగా...

అందమైన అమ్మాయి చిత్రాన్ని గీయమంటే ఎవరైనా ఏం చేస్తారు... వెంటనే పెన్సిల్‌ లేదా పెన్‌ తీసుకుని గీయడం మొదలుపెడతారు. ఆ తర్వాత దానికి చక్కని రంగులు దిద్ది మరింత అందంగా తీర్చిదిద్దుతారు. కానీ ఇక్కడున్న చిత్రాలను వేటితో వేశారో కనుక్కోవాలంటే... కాసేపు జాగ్రత్తగా వీటిని పరిశీలించాల్సిందే. కంటికి కాస్త గట్టిగా పనిచెబితేగానీ వీటిని చేప ముక్కలతో తయారుచేశారనే విషయం అర్థం కాదు. కాదేదీ కళకు అనర్హం అన్నట్టుగా చిత్రాలను ఇలా చేప, రొయ్య ముక్కలతో తీర్చిదిద్దారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్నగౌను వేసుకున్న పెద్దపాపను, నృత్య సుందరిని,  బాణం వేస్తున్న ధీరను ఇలాగే తీర్చిదిద్దారు. ఇలా చిత్రాలను రూపొందించడాన్ని జపాన్‌లో ‘సషిమి ఆర్ట్‌’ అంటారు. ట్యూనా, సాల్మన్‌ చేపలను ఉపయోగించి ఈ చిత్రాలను ఎక్కువగా తయారుచేస్తుంటారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు