close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్రాండ్‌ చూస్తే చాలదు!

మంచి బ్రాండ్‌, బ్రా నెంబరు... ఇవి మాత్రమే తెలిస్తే లోదుస్తుల ఎంపిక పూర్తవుతుందా? కాదు... ఈ విషయంలో మరికొంత అవగాహన ఉండాల్సిందే!

బ్రా సైజు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకుంటే పొరపాటే. మీ బరువులో వచ్చే మార్పులను బట్టి బ్రా సైజునూ మార్చాలి. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత వక్షోజాల పరిమాణంలో మార్పు వస్తుంది. ఈ సైజును సరిగ్గా తెలుసుకోవాలంటే.. టేప్‌ తీసుకుని వీపు నుంచి వక్షోజాల మీదుగా ముందుకు తీసుకొచ్చి నంబర్‌ను చూసుకోవాలి. ●


వరుసగా రెండు రోజులు ఒకే బ్రా వేసుకోవడం వల్ల కండరాలు పట్టేసినట్టుగా ఉండి నొప్పి వస్తుంది. అలా వేసుకోకూడదు. ●


బ్రాలను ఎప్పుడూ మడతపెట్టకూడదు. కాస్త స్థలం ఉంటే చిన్న హ్యాంగర్లకు తగిలించడమే మంచిది. ●


కప్‌ సైజు మరీ పెద్దగా ఉన్నా లేదా చిన్నగా ఉన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అవకాశం ఉంటే కొనే ముందు ట్రయల్‌ రూమ్‌లో ఒకసారి సరిచూసుకుని ఎంపిక చేసుకోవడం మంచిది. ●


ముదురు రంగు టాప్‌ వేసుకున్నప్పుడు నలుపు లేదా ముదురు నీలం రంగు బ్రా వేసుకోవాలి. ముదురు రంగు టాప్‌ మీద లేత రంగులవి వేసుకుంటే లైటింగ్‌ బాగా ఉన్నప్పుడు బయటకు కనిపించి ఇబ్బందిగా ఉంటుంది. ●


బ్రా ముందు భాగంలో ఉండే అండర్‌వైర్‌ ఎప్పుడూ రొమ్ము కింది నుంచి రావాలి. అది మరీ అతుక్కుపోయి ఉంటే కరెక్టు సైజు కాదని అర్థం.●


బ్రాలను వాషింగ్‌ మెషిన్‌లో వేసి ఉతక్కూడదు. ఒకవేళ ఉతికితే హుక్‌ పెట్టి వాషర్‌బ్యాగ్‌లో వేసి ఉతకాలి. డ్రయర్‌లో పెట్టకూడదు.●


కరెక్టు సైజువి కాకుండా కాస్త వదులుగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. అంటే మొదటి హుక్‌ పెట్టుకుంటే సరిపోయే వాటిని ఎంచుకోవాలి. కొన్ని ఉతుకుల తర్వాత వాటిని టైట్‌ చేసుకోవచ్ఛు


మరిన్ని