close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రంగుతోనే రుచి!

పిల్లలకు ఏం పెట్టినా తినట్లేదా?... అయితే వారికి ఆహారం వడ్డించే ప్లేట్లు, పాలు తాగే కప్పులు వంటివి మార్చి చూడండి. మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లపై స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అడ్రియానా మజరోవ్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. పాత్రల రంగు... రుచిని, తినాలనే ఆసక్తిని, సంతృప్తి స్థాయులను ప్రభావితం చేస్తుందనీ నిర్ధారించారామె. మామాలు గాజు గ్లాసులో పాలు, కాఫీ, బూస్ట్‌, హార్లిక్స్‌... వంటివి తాగితే కలిగే సంతృప్తికంటే ఆకర్షణీయమైన కప్పులో తాగినప్పుడు ఎక్కువ సంతృప్తి కలుగుతుందని ఈ సర్వేలో తేలింది. స్ట్రాబెర్రీ ఐస్‌క్రీంను నల్లని ప్లేటులో కాకుండా తెలుపు రంగు ప్లేటులో ఇస్తే... తీపి పది శాతం ఎక్కువగా ఉంటున్నట్లు తినే వారు భావిస్తారట. అందుకే పిల్లలు సరిగా భోజనం చేయకున్నా, పాలు తాగకున్నా వారికి ఆహారం వడ్డించే ప్లేట్లు, కప్పులు వంటివి ఆకర్షణీయంగా ఉండేట్టు మార్చి చూడండి.


మరిన్ని