close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రక్తం కలిపింది అందరినీ

నేను సిజేరియన్‌ చేయించుకున్నా... రక్తదానం చేయొచ్చా? నెలసరిలో రక్తం ఇస్తే ఇబ్బందా? రక్తదానం చేయాలనుకునే మహిళలకు ఇలా ఎన్నో సందేహాలు. అవగాహన లేక చాలామంది మహిళలు రక్తం ఇవ్వడానికి వెనకాడుతుంటారు. ఇలాంటివారిలో చైతన్యం తీసుకొస్తూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కర్ణాటకలోని మంగళూరు మహిళలు. వీరంతా బృందంగా ఏర్పడి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో రక్తాన్ని దానం చేసేదీ మహిళలే. 70 మంది మహిళలు భాగస్వాములుగా ఉన్న ఈ మంగళూరు ఉమెన్‌ వింగ్‌ని ముందుండి నడిపిస్తోంది అయీషా. ఈ బృందం ఇప్పటివరకు 226 రక్తదాన శిబిరాలని నిర్వహించింది. ప్రతి శిబిరం నుంచి 100 నుంచి 200 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఎంతో మందికి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలుస్తున్నారు. వీరిచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లోని మహిళలు కూడా ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని మహిళలకే అందేలా చూస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రక్తాన్ని సేకరిస్తున్నారు.


మరిన్ని