close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇల్లే కదా... కార్య సీమ!

‘వర్క్‌ ఫ్రం హోం’ ఇలా చేయండి...

కరోనా... కరోనా... ఎక్కడ చూసినా ఆందోళన... ఎన్నో సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయమంటున్నాయి. ఇప్పుడే కాదు... ప్రయాణసమయం ఆదా చేయడానికి ఇంటి నుంచి పని చేయమనే సంస్థలు ఇంతకు ముందూ ఉన్నాయి. అలా చేయాల్సివచ్చినప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

* ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు సకాలంలో పని పూర్తిచేయాలనే నియమాన్ని మీకు మీరే పెట్టుకోవాలి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ, నెమ్మదిగా పనిచేద్దామని అనుకోకూడదు. సాయంత్రం లోపల చేసేయొచ్చులే అనే నిర్లక్ష్య ధోరణీ పనికిరాదు. అనుకున్న సమయం లోపల పని పూర్తి చేస్తే అటు సంస్థకు, ఇటు ఉద్యోగికీ ఉభయతారకంగా ఉంటుంది.
* పని ఇంటి నుంచే కదా... లేద్దాంలే, నిదానంగా తయారవుదాంలే అనే ధోరణి కూడా వద్దు. సాధారణంగా ఆఫీసుకు వెళ్లడానికి ఏ సమయానికి నిద్రలేస్తారో అదే సమయానికి లేవాలి. అప్పటిలాగే సిద్ధమవ్వాలి.
* ఇంట్లో ఉన్నప్పుడు ధరించే సాధారణ దుస్తులనే వేసుకుని పనిచేయడానికి కూర్చుంటే.. వేగంగా, సమర్థంగా పనిచేయలేరని, మానసిక స్థితి కూడా సరిగా ఉండదని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. కాబట్టి పనికి తగ్గట్లే దుస్తులను కూడా ఎంపిక చేసుకోండి.
* మీరు పని చేసే స్థలంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. బెడ్‌రూమ్‌లో చిన్న భాగం లేదా గెస్ట్‌రూమ్‌లో ఒక మూలను ఎంచుకుంటే ఎలాంటి అవాంతరాలూ ఉండవు.
* అనుకోకుండా గ్రూప్‌ మీటింగ్‌ కోసం ఆఫీసు నుంచి ఫోన్‌ రావచ్చు. లేదా మీ ఆఫీసరు నుంచి అయిదు నిమిషాల్లో వీడియో సమావేశానికి సిద్ధంకమ్మనే సమాచారం రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి సాకులూ చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఆఫీసు పనికి కేటాయించిన సమయంలో ఆ పనిని మాత్రమే చేయాలి.

చేయకూడనివి...
* పనిలో బాగా నిమగ్నమైనప్పుడు భోజనం చేయడం, చిన్న విరామం తీసుకోవడాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆఫీసులోని భోజన, విరామ సమయాలనే ఇంటి దగ్గరా పాటించాలి.
* ఆఫీసులో మాదిరిగా ఇంట్లో వసతులు లేకపోవచ్చు. ఏసీ గదులు, కూర్చోవడానికి సౌకర్యవంతమైన కుర్చీలు ఉండకపోవచ్చు. ఇవన్నీ మీ పనితీరుపై ఆటంకం చూపకూడదు.


మరిన్ని