close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వంటింటి నుంచి పడకింటి దాకా...రక్షణ ఛత్రం!

కరోనా కాలమిది...దీన్ని ఎదుర్కొనే ప్రధానమార్గం పరిశుభ్రత. ఇంటిల్లిపాదీ బాగుండాలంటే వంటింటి నుంచి పడకింటి దాకా అన్నీ అద్దంలా మెరవాల్సిందే. ప్రతి గదీ పరిశుభ్రంగా ఉంచాల్సిందే. కానీ ఎంత శుభ్రం చేసినా కంటికి కనిపించని క్రిములు ఉంటాయి.  అలాంటి వాటి నుంచి మన  ఆరోగ్యానికి రక్షణ కల్పించేందుకు ఈ పరికరాలు ఉపకరిస్తాయి.
 


వంటింటి క్రిముల నుంచి రక్షణ

మనం తినే ఆహారమంతా వంటింటి నుంచే తయారవుతుంది కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కూరగాయలను కోసే చెక్క లేదా ప్లాస్టిక్‌ చాప్‌బోర్డు మీదే చికెన్‌, మటన్‌, చేపలు లాంటి మాంసాహారాలను కోస్తుంటాం. అలాంటప్పుడు వాటిపై పేరుకునే బ్యాక్టీరియా వల్ల అనారోగ్యాల బారినా పడవచ్చు. అలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ‘ఇన్‌స్టెంట్‌ శానిటైజింగ్‌ కిచెన్‌ వాండ్‌’ను వంటింట్లో ఉంచుకోవాల్సిందే. దీన్ని కూరగాయలు కోసే చాప్‌బోర్డుమీద ఉంచితే అక్కడ ఉండే క్రిములన్నీ నాశనమవుతాయి.


పడకింటి శుభ్రత కోసం

పడకగదిలో క్రిములు ఎక్కడ ఉంటాయి అనే అనుమానం రావొచ్చు. దిండ్లు, పరుపులని మనం రోజులు, నెలలు తరబడి శుభ్రం చేయం. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఎండలో వేస్తాం. కానీ మన శరరీంలోని మృతకణాలు మొదలుకొని... చుండ్రుతో పాటు ఇతరత్రా క్రిములు పేరుకునేది ఇక్కడే. అందుకే వీటిని ఎప్పటికప్పుడు క్రిమిరహితంగా ఉంచుకోవాలి. అలా చేయాలంటే ‘శానిటైజింగ్‌ హ్యాండ్‌హెల్డ్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్స్‌’ మన దగ్గర ఉండాల్సిందే. దీంట్లోంచి వచ్చే యూవీ కిరణాలు దుమ్మూ, ధూళితోపాటు వైరస్‌, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో సుఖంగానేకాదు శుభ్రంగానూ, ఆరోగ్యంగానూ నిద్రపోవచ్చు.


కాయగూరలను శుభ్రం చేస్తుంది

బయట నుంచి తెచ్చిన కాయగూరలని ఎంత శుభ్రం చేసినా వాటిమీద క్రిములు ఉండిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాటిని నీళ్లలో వేసి స్టెరిలైజ్‌ చేయాలి. ఇందుకు ఉపకరించేదే ఈ వాటర్‌ స్టెరిలైజర్‌. పండ్లు, కూరగాయలు, పాల సీసాలు, వంట పాత్రలు... వంటివి నీళ్లలో వేసి అందులో ఈ పరికరాన్ని ఉంచితే చాలు. వాటిల్లో ఉండే హానికారక క్రిములను నాశనం చేస్తుంది. బయట నుంచి తెచ్చిన కాయగూరలని ఎంత శుభ్రం చేసినా వాటిమీద క్రిములు ఉండిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాటిని నీళ్లలో వేసి స్టెరిలైజ్‌ చేయాలి. ఇందుకు ఉపకరించేదే ఈ వాటర్‌ స్టెరిలైజర్‌. పండ్లు, కూరగాయలు, పాల సీసాలు, వంట పాత్రలు... వంటివి నీళ్లలో వేసి అందులో ఈ పరికరాన్ని ఉంచితే చాలు. వాటిల్లో ఉండే హానికారక క్రిములను నాశనం చేస్తుంది.


టవల్‌ డ్రయ్యర్‌

ఒకరు వాడిన తువ్వాలునే మరొకరం వాడేస్తుంటాం. దాంతో ఒకరి నుంచి మరొకరికి క్రిములు వ్యాప్తిచెందడానికి అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆవిష్కరించిందే ‘టవల్‌ డ్రయ్యర్‌’. టవల్‌ను దీనికి తగిలిస్తే... ఇందులోంచి వెలువడే యూవీ కిరణాలు తువ్వాలుని ఆరబెట్టడమే కాకుండా దానిపైన ఉండే క్రిములనూ నాశనం చేస్తాయి.


 


మరిన్ని