close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లేత వర్ణాల సోయగం...

అనుబంధాల పొదరిల్లు... అందంగా ఉండటంతో పాటు మనసుకు ప్రశాంతతనూ అందివ్వాలి. మన అభిరుచులకు అద్దంపట్టాలి. ఇంటికి వచ్చిన స్నేహితులు, అతిథులు ఇంటి అలంకరణను చూసి మనల్ని మెచ్చుకోవాలి. అందరి ఆలోచనలు కాస్త అటూఇటూ ఇలాగే ఉంటాయి. ఇలాంటి ఆలోచనలకు నిలువెత్తు రూపమే ‘జపాండీ’...  
ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఈమధ్య ‘జపాండీ’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యూరప్‌లో ప్రాచుర్యం పొందిన స్కాండినేవియన్‌, జపాన్‌ డిజైన్ల కలయికతో ఆవిర్భవించిందే ఈ జపాండీ. దీంట్లో వస్తువుల కంటే అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ డిజైన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. పూర్తిగా ముదురు రంగులూ వాడరు, పూర్తిగా లేత రంగులూ వాడరు. ముదురు రంగులో మొదలైన డిజైన్‌ మెల్లగా లేత రంగును సంతరించుకుంటుంది. డిజైన్లతోపాటుగా ప్రకృతికీ గదిలో స్థానం కల్పిస్తారు. సాధారణంగా మొక్కల కుండీలను గది బయట పెడుతుంటాం. అలాకాకుండా ఇక్కడ గది లోపలే ఉంచుతారు. చెక్కతో తయారుచేసిన వస్తువులతో గదులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. సాధారణంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఆరుబయటకు వెళ్లాల్సిందే. కానీ ఈ జపాండీ డిజైన్‌తో ఇంట్లో కూర్చునే ప్రకృతితో మమేకం కావచ్చు.


మరిన్ని