close

వసుంధర

మృదువైన చేతుల కోసం!

పదే పదే చేతులను శానిటైజర్‌, సబ్బుతో శుభ్రం చేసుకోవడం వల్ల చేతివేళ్లు పొడిబారి పోవడమే కాకుండా దురద కూడా వస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా చేయండి....

ఆయిల్‌ మసాజ్‌...

పొడిబారిన చేతులకు రెండు మూడు నిమిషాలపాటు ఏదైనా వంటనూనెతో కానీ కొబ్బరినూనెతో కానీ చేతి వేళ్లపై మృదువుగా మర్దన చేయాలి.

మీగడ...

ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. కాస్తంత మీగడను తీసుకుని చేతులకు రాసి రుద్దితే అవి మృదువుగా మారతాయి. మెరుస్తాయి కూడా.

నిమ్మతో...

ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో నిమ్మ రసం పిండాలి. ఈ నీటిలో చేతులను పది నిమిషాలు మునిగేలా పెట్టాలి. ఇలాచేస్తే రసాయనాల వల్ల పొడిగా, నిర్జీవంగా మారిన చేతులు ఆరోగ్యంగా, మృదువుగా మారతాయి.

గ్లిజరిన్‌, గులాబీ నీటితో...

చెంచా గులాబీ నీటిలో కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి చేతులకు రుద్దుకోవాలి. ఇలా చేస్తే వేళ్లు మృదువుగా మారతాయి.

ఈ చిట్కాలను రాత్రి పడుకోబోయే ముందు పాటిస్తే చేతులకు పోషణ లభించి మృదువుగా, ఆరోగ్యంగా మారతాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు