close

ఫీచర్ పేజీలు

అది ఒంటరి పోరాటమైనా!

క్రీస్తు వాణి

‘నీ ధైర్యాన్ని విడిచి పెట్టొద్ధు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమతి దొరుకుతుంది’- ఇది బైబిల్‌ సూక్తి.

నిరంతరం ఏదో సమస్య. మనుషుల విశ్వాసానికి పరీక్ష. అంటురోగాలు, ప్రకృతి వైపరీత్యాలు మారణహోమం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు అకుంఠిత విశ్వాసమే మానవాళికి తరుణోపాయమని క్రీస్తు బోధించారు. ఒక్కరొక్కరుగా పోరాటం మొదలు పెడితే అది సామూహిక సమరంగా మారుతుంది. అందుకే ఒక్కరుగా చేసే పోరాటాన్ని తక్కువగా చూడొద్దంటారు. బైబిల్‌లోని దావీదు, గొల్యాత్‌ల కథ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. గొల్యాత్‌ అనే వాడు మహా రాక్షసుడు. అందరినీ పీడించి, చంపే క్రూరుడు. అలాంటి వాడిని చంపడానికి ప్రజలంతా సామూహికంగా వెళ్లలేదు. గుంపుగా గుమిగూడలేదు. దావీదు ఒక్కడే ఒంటరి సైనికుడిలా ముందుకురికాడు. ధైర్యంగా ఆ రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. వడిసెలలో అయిదు రాళ్లతో అతణ్ణి మట్టి కరిపించాడు. అందుకే ఒంటరిగా విపత్తులను ఎదుర్కొన్నా ఫలితం లోకకల్యాణమే. - ఎం.సుగుణరావు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు