close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి: జగన్‌

కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకు ఒకసారి వస్తాయో రావో తెలియదని.. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కోలేకపోతే చాలా కష్టంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే కరోనాను కట్టడి చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 14 వరకు (సుమారు మరో మూడువారాలు) ఎక్కడికీ కదలొద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేస్తాం:ఏపీ మంత్రి

కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇళ్ల వద్దకే పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు చేపట్టామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి వెళ్లేందుకు వీలుగా 6 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు లేకుండా హాజరు ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ సంస్థ అధినేత పీవీ కృష్ణారెడ్డి రూ.5 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అలాగే, శాంతా బయోటెక్‌ సంస్థ అధినేత వరప్రసాద్‌ రెడ్డి వ్యక్తిగత సాయంగా రూ. కోటి చెక్కు సీఎంగా అందించగా.. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత నర్సింహారెడ్డి, మీనాక్షి గ్రూప్‌ ఛైర్మన్‌ కె.ఎస్‌.రావు, క్రెడాయ్‌ ప్రతినిధులు రూ.కోటి చొప్పున చెక్కులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రేషన్‌కార్డులేని పేదలనూ ఆదుకోండి:ఉత్తమ్‌

కరోనా వైరస్‌ రూపంలో ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటోందని.. మానవ జాతినే ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాట్లాడిన ఆయన.. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు వెంటనే అందివ్వాలని.. తెల్లరేషన్‌ కార్డు లేని పేదలను గుర్తించి వారినీ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కరోనాపై పోరు: చిరు, మహేశ్‌, ప్రభాస్‌ విరాళం

కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ‘సూపర్‌స్టార్‌’ మహేశ్‌బాబు భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగించింది. ఏప్రిల్‌ 14 వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. ఏప్రిల్‌ 14 వరకు హైదరాబాద్‌ మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఏప్రిల్‌ మొదటి వారంలో పీఎం-కిసాన్‌ నిధులు

లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పీఎం-కిసాన్‌ తొలి విడత నిధులను ఏప్రిల్‌ మొదటి వారంలోనే విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడత కింద రూ.2వేలు చొప్పున 8.69 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. ప్యాకేజీ ప్రకటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం వెల్లడించారు. పీఎం-కిసాన్‌ పథకం కింద ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రూ.7,500కే వెంటిలేటర్!

కరోనా పోరులో తనవంతు సహకారం అందిస్తామని ప్రకటించిన మహీంద్రా గ్రూప్‌.. అందులో భాగంగా తొలి అడుగు వేసింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్‌ అందించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపింది. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్‌ వెర్షన్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ నమూనాను రూపొందించామని, మూడు రోజుల్లో అనుమతులు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనా లాక్‌డౌన్‌.. ప్రజల జీవన చిత్రాలు

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు అప్రమత్తమయ్యారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. మరి కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల జీవన చిత్రాలివీ.. చిత్రాల కోసం క్లిక్‌ చేయండి 

10. ‘కరోనా’పై యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందించిన ఈటీవీమరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు