close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పోషకాలుతేనెలూర!

అన్నప్రాశనలో తేనె... ఇష్టదైవం అభిషేకంలో తేనె.. తేనీరులో తేనె ఇలా మన జీవితంతో పెనవేసుకున్న తేనె రుచిలోనే కాదు.. ఔషధ గుణాల్లోనూ రారాజు... 

ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలున్నవాళ్లు గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనె, మిరియాల పొడి వేసి తాగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. ●

కొత్త తేనె శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. పాత తేనె తీసుకుంటే మలబద్ధకం ఉండదు. తేనె ఎంత పాతబడితే అంత మంచిది.

ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అరచెంచా తేనె వేడినీళ్లలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజూ మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి.

అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే... అరకప్పు వేడి నీటిలో రెండు చెంచాల తేనె, వేయించిన వాము చెంచా వేసి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.

గోరువెచ్చటి నీళ్లలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతుంది.

కాఫీ, టీలకు బదులుగా తాగే గ్రీన్‌టీలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉన్నవాళ్లు తేనెను గోరువెచ్చటి నీళ్లతో కలిపి రోజుకోసారి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉంటుంది.

తేనె చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.

అల్లం ముక్కలను తేనెలో నానబెట్టి తీసుకుంటే పైత్యం, అజీర్తి, కడుపులో తిప్పడం, నోటి దర్వాసన, పుల్లటి తేన్పులు తగ్గుతాయి. ఇది బాలింతలకూ మంచిది.

పిల్లలు పుష్టిగా పెరగాలంటే...

పిల్లలు పుష్టిగా పెరగాలంటే పండ్ల రసాల్లో పంచదార బదులుగా తేనెను కలపాలి. మామిడిపండ్ల రసం, అరటిపండ్ల గుజ్జులో తేనెను కలిపి ఇస్తే కంటి చూపు మెరుగవుతుంది.

హాయి నిద్రకు...

పాలల్లో పంచదారకు బదులుగా తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. రాత్రి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.

బరువు పెంచే పదార్థాలతో కలిపి వాడితే బరువు పెరుగుతారు. తగ్గించే పదార్థాలతో కలిపి వాడితే తగ్గుతారు.

జాగ్రత్తలు...

తేనెను నేరుగా వేడిచేయకూడదు. తేనె గట్టిపడితే వేడినీళ్లలో పెట్టాలి.

ఎండలో తిరిగి వచ్చిన వెంటనే, ఎక్కువగా వ్యాయామం చేసిన తర్వాత తేనె తీసుకోకూడదు. బాగా సన్నగా ఉన్నవాళ్లు తేనెను నేరుగా వాడకూడదు.

తేనె నల్లగా మారినా, పుల్లగా ఉన్నా, గట్టిగా తయారైనా ఉపయోగించకూడదు.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


మరిన్ని