close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మది నిండా మానవత్వంతో..

నిండు గర్భంతో..

అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రం పీహెచ్‌సీ అది. అక్కడ ఇన్‌ఛార్జిగా సేవలు అందిస్తున్నారు డాక్టర్‌ ప్రత్యూష. ఎనిమిది నెలల గర్భిణి ఆమె. కావాలనుకుంటే సెలవులు తీసుకోవచ్చు. కానీ, వద్దనుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించాలనుకున్నారు. ఆస్పత్రికి వస్తున్న రోగులను పరీక్షిస్తున్నారు. కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రత్యూష నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. బెంగళూరులో పీజీ చేశారు. గతేడాది గోరంట్ల పీహెచ్‌సీలో వైద్య అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె భర్త కర్ణాటకలో ఉంటారు. ఆయన భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో అత్తమామలు, మూడేళ్ల చిన్నారి బాధ్యత కూడా ఆమెదే! ఈ నేపథ్యంలో రోజూ విధులకు హాజరవుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అత్యవసర కేసులు వస్తే.. వెంటనే ఆస్పత్రికి వెళుతున్నారు. కాన్పులు చేస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి, వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి..అహర్నిశలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. వృత్తిపై ఆమె అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు.

- ఆర్‌ఏఎన్‌ ప్రసాద్‌
న్యూస్‌టుడే, గోరంట్ల


మరిన్ని