close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కలయికలో కలవరం!

*నా వయసు 32. నాకు పది నెలల బాబున్నాడు. కలయిక సమయంలో నొప్పి, మంటగా అనిపిస్తోంది. దీనికి పరిష్కారమేంటి?      

- ఓ సోదరి

జ: మీకు పది నెలల బాబున్నాడు అని రాశారు. అయితే మీకు నెలసరి తిరిగి మొదలైందో లేదో తెలియదు. బాబుకు పాలిస్తున్నారా, నెలసరి తిరిగి మొదలైందా అన్న వివరాలు ముఖ్యం. ఎందుకంటే నెలసరి మొదలయ్యే వరకు కూడా శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని కలయిక సమయంలో నొప్పి, మంట ఉండటం సహజం. ఇలాంటప్పుడు మీరు  లూబ్రికెంట్స్‌  వాడితే నొప్పి తగ్గుతుంది. అలాకాకుండా మీకు ఇప్పటికే నెలసరి మొదలైతే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించండి. ఈ సమస్యకు ఇన్‌ఫెక్షన్‌ కూడా మరో కారణం కావచ్చు. కాబట్టి వైద్యులు పరీక్ష చేసి మందులు సూచిస్తారు.


*నేను ఇంటర్మీడియట్‌ పూర్తి చేశా. నా ఛాతీ చాలా చిన్నగా ఉంటుంది. మందులు వాడకుండా ఇంటి చిట్కాలతోనే ఛాతీ పరిమాణం పెరిగే మార్గాలుంటే చెప్పండి.    
 

- ఓ సోదరి

మీ బరువు ఎంత ఉందో రాయలేదు. సాధారణంగా ఛాతీ పరిమాణం వయసు, జన్యుపరమైన లక్షణాలను బట్టి ఉంటుంది. ఒకసారి ఎదుగుదల పూర్తయ్యాక ఛాతీ పరిమాణంలో మార్పు ఉండదు. తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు మాత్రమే ఛాతీ పరిమాణం పెరుగుతుంది. అయితే వక్షోజాల్లో పాలగ్రంథులతోపాటు కొవ్వు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి మీరు బరువు పెరిగితే కొంతవరకు ఛాతీ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి మందులు వాడమని కూడా వైద్యులు ఎప్పుడూ సలహా ఇవ్వరు. ఎందుకంటే హార్మోన్‌ మాత్రల వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు.


 


మరిన్ని